సృష్టి ఎలా ఆరంభం అయ్యింది? "How did creation begin?"
పవిత్ర గ్రంథంలో ఉన్న గ్రంథాలను పరి శీలనగా చదివినప్పుడు ప్రకటన గ్రంథములో ఒక ప్రత్యేకమైన సంఘటన కనిపిస్తుంది; అంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం లో ఒక సంఘటన జరిగిందని ఉన్నది. మిఖాయేలు మరియు ఆయన దూతలు, ఘటసర్పం మరియు ఆయన దూతల మధ్య యుద్ధం జరిగినప్పుడు, ఆ యుద్ధంలో ఘటసర్పం మరియు దాని అనుచరులు ఓడిపోతారు. ఓడిపోయిన వీరికీ పరలోకంలో నివసించడానికి స్థలం ఉండదు. అప్పడు ఈ ఘటసర్పం ఎటు పోవాలో తెలియక “నేను ఎటు వెళ్లాలి” అని అడుగుతుంది; దానికి ఫలితంగా దేవుడు “కలుగునుగాక” అనే ఒకే ఒక మాటతో సమస్తమును చేస్తాడు అంటే మొదటిగా మట్టితో కూడిన విశ్వమును చేస్తాడు. ఉదాహరణకు: ఆదికాండం 1:1 లో దేవుడు భూమిని నిరాకారముగాను శూన్యముగాను ఉన్నదని వ్రాసి ఉన్నది. అంటే దేవుడు కలుగునుగాక అనే మట్టిని మొదటిగా తన పలుకుతో సృష్టించెనని అర్థం. అందువలన బైబిల్‌ను ఎవరూ ఆదికాండం నుండి చదివితే అర్థం కాదని తెలుస్తుంది.